టీమిండియాలో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఏ రేంజ్ లో క్రేజ్  ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన ఆట తీరుతో తన సత్తా ఏంటో ఇప్పటికే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అర్థమయ్యేలా చేశాడు విరాట్ కోహ్లీ. ఇక తన ఆటతీరుతో ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొట్టాడు. వరల్డ్ లో క్రికెట్లో ఉన్న లెజెండ్స్ కెరియర్ కాలం మొత్తంలో సాధించిన రికార్డులను కోహ్లీ మాత్రం అతి తక్కువ సమయంలోనే బ్రేక్ చేశాడు అని చెప్పాలి.


 ఇలా విరాట్ కోహ్లీ ఖాతాలో ఎన్నో వందల రికార్డులు ఉన్నాయి. కానీ ఇంకా జట్టులోకి వచ్చి ఏదో నిరూపించుకోవాలనుకునే కొత్త ఆతగాడిలో ఉండే కసి.. విరాట్ కోహ్లీలో కనిపిస్తూ ఉంటుంది. అందుకే విరాట్ ను రికార్డుల రారాజు అని పిలుస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇంకొంతమంది అభిమానులు రన్ మిషన్ అని కూడా పిలుచుకుంటూ ఉండటం గమనార్హం. విరాట్ కోహ్లీ ఇప్పటికీ ఎన్ని రికార్డులు సాధించిన ఇంకా రికార్డులు వేట కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక ఇటీవల మరో అరుదైన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి. ఐపిఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.


 ఒక జట్టు తరుపున అత్యధిక సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా నిలిచాడు విరాట్ కోహ్లీ. ఇప్పటివరకు ఆర్సీబీ జట్టు తరఫున 250 సిక్సర్లు కొట్టాడు కోహ్లీ.ఇక ఆ తర్వాత స్థానంలో క్రిస్ గేల్ ఆర్ సి బి తరఫున 239 సిక్సర్లు కొట్టి రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఇదే జట్టు తరఫున ఏపీ డివిలియర్స్ 234 సిక్సర్లు కొట్టడం గమనార్హం. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 224 సిక్సర్లతో ఆ టీం తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్గా కొనసాగుతున్నాడు. ఆ తర్వాత అదే ముంబై ఇండియన్స్ తరఫున కిరణ్ పోలార్డ్ 221 సిక్సర్లు  కొట్టాడు. మొత్తంగా ఐపీఎల్ హిస్టరీలో చూసుకుంటే క్రిస్ గేల్ 357 సిక్సర్లతో అందరికి మించి టాప్ లో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: