ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అసలు సిసలైన  ఎంటర్టైన్మెంట్ పంచె ఒక మంచి టోర్నీగా కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం ఎంటర్టైన్మెంట్ పంచడమే కాదు ఎంతో మంది యువ ఆటగాళ్లకు తమ సత్తా ఏంటో నిరూపించుకొని ప్రపంచానికి సుపరిచితులుగా మారేందుకు ఒక మంచి వేదికగా మారిపోయింది. ఇక అప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఆటగాళ్లకు ఇక కొత్త అనుభవాన్ని ఇచ్చే టోర్నీగా కొనసాగుతుంది ఐపీఎల్.


 ఈ క్రమంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన ప్రతిసారి కూడా ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో ఆకట్టుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్ లోకి వచ్చి ఇక అప్పటికే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ల లాగే అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇక టాక్ ఆఫ్ ది టోర్నీగా మారిపోతూ ఉంటారు. ఇక ఐపీఎల్ లో కూడా ఇలాగే ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ ఇరగదీస్తున్నారు. ఇలాంటి వారిలో సన్రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా ఒకరు అని చెప్పాలి  అతను బ్యాటింగ్లో సృష్టిస్తున్న విధ్వంసం ముందు స్టార్ బౌలర్లు సైతం వణికిపోతున్నారు.


 అనుభవమున్న ఆటగాళ్ళే తడబడుతున్న మైదానాలలో సైతం అటు అభిషేక్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అందరూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా స్టార్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ ఒక అద్భుతం అంటూ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకల్ వాన్ అన్నారు. టీమ్ ఇండియాలో అతడికి గొప్ప భవిష్యత్తు ఉంది. అతనిలోని టెక్నిక్ అమోఘం. యశస్వి జైష్వాల్ లాగానే మూడు ఫార్మాట్లలో కూడా రానించగలడు. అతడిలో బ్రియాన్ లారా టెక్నిక్ అండ్ స్టైల్.. యువరాజ్ ఫ్లెక్సిబిలిటీ విధ్వంసం ఉన్నాయి.  అతడు బ్యాటింగ్ చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇక త్వరలోనే అతను టీమిండియాలో కూడా ఉండవచ్చు అంటూ మైఖేల్ వాన్ ప్రశంసించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl