ఇటీవల ఐపీఎల్ లో భాగంగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో అటు బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులందరికీ కూడా నిరాశ మిగిలింది అన్న విషయం తెలుస్తుంది. ఎందుకంటే ధోనీకి ఇదే చివరి ఐపిఎల్ సీజన్ అని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఇక ధోని కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు. చివరికి రిటైర్మెంట్ కి ముందు ధోని కి అటు కొత్త కెప్టెన్ రుతురాజ్ టైటిల్ గెలిచి బహుమతిగా ఇస్తాడు అని అందరూ ఊహించారు. అనుకున్నట్లుగానే అటు చెన్నై జట్టు మంచి ప్రస్తానాన్ని కొనసాగించింది.


 అయితే ఇటీవలే అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మాత్రం ఇక చెన్నై అభిమానుల ఆశలు మొత్తం ఆవిరయ్యాయి అని చెప్పాలి. ఎందుకంటే ఇక ఈ మ్యాచ్ లో అటు చెన్నై జట్టు ఓడిపోయింది. దీంతో ఈ ఓటమి ద్వారా ఇక ప్లే ఆఫ్ లో అడుగు పెట్టకుండా టోర్ని నుంచి నిష్క్రమించింది అని చెప్పాలి. దీంతో ఇక చెన్నై అభిమానులు అందరూ కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. కేవలం అభిమానులు మాత్రమే కాదు లెజెండరీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని సైతం తీవ్ర అసంతృప్తితో షేక్ హాండ్స్ ఇవ్వకుండానే మైదానం వీడిన సంగతి తెలిసిందే.


 అయితే ఇలా తీవ్ర నిరాశకు గురైన ధోని డగౌట్ వెళ్లిపోవడంతో ఇక ధోనినీ కలిసేందుకు విరాట్ కోహ్లీ చెన్నేయ్ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్ళాడట. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీకి ఆల్ ది బెస్ట్ చెప్పి మహేంద్రసింగ్ ధోని పంపించాడట. ఈసారి నువ్వు ఫైనల్ కు వెళ్లాలి టైటిల్ కొట్టాలి. గుడ్ లక్ అంటూ చెప్పాడట మహేంద్ర సింగ్ ధోని. ఇక ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇది తెలిసి మహిరాట్ మధ్య స్నేహబంధం అలాంటిది. వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని మించిన ఎమోషన్ మరొకటి లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: