
సీరియల్స్‌నందు ‘కార్తీక దీపం’ వేరయా. అవును! ఇప్పుడు ఇదే అంటున్నారు బుల్లితెర వీక్షకులు. ఆడమగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని టీవీకి కట్టిపడేస్తుంది ఈ సీరియల్. రాత్రి గం.7.30ని.లు అయ్యిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది ఇళ్లలోని టీవీల్లో కార్తీక దీపం కనిపిస్తుంటుంది. అంతేకాదు స్టార్ హీరోల హిట్టు సినిమాలు కూడా.. టీఆర్పీ రేటింగ్‌లో వంటలక్కతో పోటీపడలేకపోతున్నాయి. ఇక సీరియల్‌తో ఆలిండియా లెవెల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న వంటలక్క అలియాస్ దీప అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సీరియల్ ఇంతగా హీట్ అవ్వడానికి ఈమె ప్రధాన కారణం అనడంతో ఏ మాత్రం సందేహం లేదు.
దీపగా, వంటలక్కగా నటి ప్రేమి విశ్వనాథ్ తన నటనతో ఆకట్టుకుంటోంది. ఆమె నటనే సీరియల్ కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాల్లో ఇప్పుడు బాహుబలి, నాన్ బాహుబలి అన్నట్లుగానే.. సీరియల్‌ల్లో కార్తీకదీపం, నాన్ కార్తీకదీపం అనే పరిస్థితి రానే వచ్చిందంటే కారణం ఈ వంటలక్కే. అంతేకాదు, ఈమె నుంచీ ఏ చిన్న అప్డేట్ వచ్చినా.. మహిళలు, పురుషులు అని తేడా లేకుండా అందరూ ఎంతో ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. ఇక కన్నడలో కారుతుముత్తు సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చిన ప్రేమి విశ్వనాథ్.. పలు గేమ్ షోలకు హోస్ట్‌గానూ వ్యవహరించారు.
కానీ, తెలుగులో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్‌తోనే తిరుగులేని క్రేజ్ సంపాదించారు. అయితే ఇలా సీరియల్స్‌లో సత్తా చాటుతూనే.. సినిమాల్లోనూ సత్తా చాటేందుకు రెడీ అయ్యింది ప్రేమి విశ్వనాథ్. తాజాగా ఆమె మళయాలంలో ‘సాల్మన్’ అనే మూవీలో నటిస్తుంది. తాజాగా ఈ సినిమాలో నటించిన నటుడు రాజివెట్టన్‌తో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది ప్రేమి విశ్వనాథ్. ఇక ఇప్పటి వరకు బుల్లితెరకే పరిమితమైన వంటలక్క ఇప్పుడు సాల్మన్ సినిమాతో వెండితెరకు కూడా పరిచయడం కాబోతోంది. దీంతో వంటలక్క ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.