
కాగా ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ కూడా చాలా హాట్ హాట్ గా సాగింది. ప్రస్తుతం హౌస్ లో 12 మంది మాత్రమే ఉండగా, శ్రీసత్య కెప్టెన్ కావడం వలన ఆమె సేఫ్ అయింది. రోహిత్ మరియు రాజ్ లు సేఫ్ గేమ్ ఆడుకుంటూ ఎలిమినేషన్ నుండి తప్పుకున్నారు. ఇక వివిధ కారణాలతో హౌస్ లో మొత్తం 9 మంది నామినేట్ అయ్యారు. వారిలో ఆది రెడ్డి, బాలాదిత్య, ఫైమా, ఇనయ సుల్తానా, కీర్తి భట్ , మెరీనా, రేవంత్ , శ్రీహన్ మరియు వాసంతి లు ఉన్నారు. అయితే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే రేవంత్ , ఇనాయాలు ఆటవలనో లేదా తమ నోరు వలనో మంచి ఓటింగ్ ను పొందుతున్నారు. దీనితో వీరిద్దరూ ఖచ్చితంగా సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువ.
ఇక ఆదిరెడ్డి కూడా గీతు ఓటింగ్ షేర్ యాడ్ అవుతుండడంతో అతను కూడా సేఫ్ అయినట్లే. మెరీనా, ఫైమా మరియు శ్రీహన్ లలో కూడా కొన్ని మైనస్ లు ఉన్నప్పటికి అవి వారు ఎలిమినేట్ అవడానికి కారణం అవుతాయని భావించడం లేదు. కీర్తి భట్ కూడా అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా తన కష్టాన్ని చూపెడుతూ ఆడుతోంది. ఇక మిగిలింది బాలాదిత్య మరియు వాసంతిలు ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది. గత వారం జరిగిన సంఘటన బాలాదిత్యకు మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయట. ఇక వాసంతి కూడా పొంతనలేని ఆట మరియు మాటలతో జనాలను విసిగిస్తోంది అన్న విమర్శలు వస్తున్నాయి.