బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్స్ ఎప్పటిలాగే రసాభాషగా జరిగాయి. గత వారం మధ్యలో కెప్టెన్ గా ఎంపిక అయిన ఫైమా తప్ప హౌస్ లో ఉన్న 9 మంది సభ్యులు నామినేషన్ లో ఉన్నారు. వారిలో రేవంత్, రోహిత్, శ్రీహన్, ఆది రెడ్డి, రాజ్, కీర్తి, శ్రీసత్య , మెరీనా మరియు ఇనాయాలు ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ లో 11 వ వారం గడుస్తోంది. ఇక ఫైనల్ వీక్ కు ఉన్నది నాలుగు వారాలే కాబట్టి రెట్టించిన ఉత్సాహంతో ఆడాల్సి ఉంది. ఇక ప్రతివారం లాగానే ఈ వారం కూడా హౌస్ నుండి ఒకరు ఇంటిని వదిలి వెళ్లనున్నారు. అయితే ఆ ఒక్కరు ఎవరన్న విషయం గురించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఉన్న బిగ్ బాస్ అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న.

బిగ్ బాస్ అనే రియాలిటీ గేమ్ షో లో విజేతగా నిలవాలంటే ఆటతో పాటుగా , మంచి నడవడిక , మంచి మాటతీరు కూడా చాలా ముఖ్యం. అయితే ఆటలో భాగంగా ప్రతి ఒక్కరూ సీరియస్ అవ్వడం సహజం.. కానీ అవసరం లేకున్నా కూడా మనిషిని కవ్వించడం , ఎదుటివాళ్ళ వీక్నెస్ తో ఆడుకోవడం వంటివి షో చూస్తున్న ప్రజలు ఒప్పుకోరు. ఈ విషయం గతంలో చాలా సార్లు చూశాము. ఇక ఇటువంటి వాటిలో శ్రీసత్య ముందుంటుంది అని చెప్పాలి. తనకు ఎవరైనా నచ్చకపోతే వారిపై జోక్స్ వేసుకోవడం, తమను నామినేట్ చేసినా వారిని సాధించడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా శ్రీసత్యలో యాటిట్యూడ్ ఇస్యూస్ కూడా ఉన్నాయి.

ఈవారం శ్రీసత్య నామినేషన్ లో ఉన్న విషయం తెలిసిందే.. ఉన్న వారిలో శ్రీసత్య మరియు మరీనాలు మాత్రమే మిగిలిన వారితో పోల్చుకుంటే కొంచెం వీక్ గా ఉన్నారు. ఇక రాత్రి కీర్తి విషయంలో మాట్లాడిన తీరు పట్ల ప్రేక్షకులు గుర్రుగా ఉన్నారు. ఇద్దరి మధ్య ఈగో గురించి వచ్చిన చర్చలో మరింత వెటకారంగా మాట్లాడి పైకి తెచ్చుకుంది. అందుకే ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్లే వారిలో వీరిద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ వారం ఓటింగ్ శుక్రవారం నైట్ వరకు ఉంటది కాబట్టి.. ఆటతీరు కొంచెం మెరుగుపడితే ఓట్లు పడి సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.. లేదంటే ఎలిమినేట్ అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: