సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న శివ బాలాజీ అదే ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ దక్కించుకున్న మధుమితను వివాహం చేసుకున్నారు. అయితే ఇటీవల ఒక కార్యక్రమానికి అతిధులుగా వచ్చిన వీరు హోస్ట్ అయిన వెన్నెల కిషోర్ తో సరదాగా ఎన్నో విషయాలను పంచుకోవడం జరిగింది. ఫిలిం ఇండస్ట్రీలో నటీనటులుగా ఉంటూ ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న జంటలలో శివ బాలాజీ, మధుమిత జంట కూడా ఉన్నారు. మీరు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా సరే ప్రస్తుతం సంతోషమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

ఇకపోతే అందరిలాగే తాము కూడా ఎన్నో గొడవలు పడ్డామని తాము పెళ్లి చేసు కోవడమే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నామని తెలిపారు ఈ జంట. షూటింగ్లో కలిసినప్పుడు ఒకరిని మరొకరు చూసుకోవడం నుంచి ప్రేమించుకోవడం వరకు వ్యవహారం సాగింది అని.. అంతేకాదు మధుమిత లిప్స్టిక్ తుడిచిన టిష్యూస్ ని కూడా కావాలని ఆమె ముందే తీసుకున్నారట శివబాలాజీ. ఆ తర్వాత కొద్ది రోజులకు శివ బాలాజీ మధుమితకు ప్రపోజ్ చేశారట అయితే ఐ లవ్ యు మాత్రం చెప్పలేదని పెళ్లి చేసుకుందామంటూ డైరెక్ట్గా మ్యారేజ్ ప్రపోజ్ పెట్టాడట శివ బాలాజీ

అయితే ఇంట్లో వాళ్ళు కూడా పెళ్లికి ఒప్పుకోవడంతో ఇద్దరి జాతకాలు కలవలేదు అన్న ఒక్క షాకింగ్ వార్త తెలిసింది. అంతేకాదు మధుమితను వివాహం చేసుకుంటే మా తల్లికి ప్రాణగండం ఉందని కూడా చెప్పారట. దాంతో మధుకి ఈ విషయం చెప్పడం దాదాపు ఒకటిన్నర సంవత్సరం వరకు కూడా మేమిద్దరం మాట్లాడుకోలేదు. ఆ తర్వాత నేనే మధు గురించి ఎంక్వైరీ చేశాను అంటూ తెలిపారు శివబాలాజీ. ఇక తనపై కోపంగా ఉన్నా సరే కన్విన్స్ చేసి ఇంట్లో వాళ్లతో యుద్ధం చేసి మరి పెళ్లి చేసుకున్నాను అంటూ తెలిపారు. మొత్తానికి అయితే శివ బాలాజీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: