ఢీ స్పెషల్ విన్నర్ గా నిలిచిన జాను.. తనకంటే ఎక్కువగా శేఖర్ మాస్టర్ పిలిచిన జాను జాను అని పిలుపుతోనే మరింత పాపులారిటీ సంపాదించుకున్నది. ఫోక్ డాన్సర్ గా మొదట గుర్తింపు సంపాదించుకున్న జాను ఆ తరువాత పలు రకాల టీవీ షోలతో కూడా అదరగొట్టేసింది. ఢీ షో వల్ల మంచి పాపులారిటీ సంపాదించుకోవడంతో పాటుగా ఈమె ఈ షో విన్నర్ గా కూడా నిలవడంతో ఒక్కసారిగా ఈమె పేరు వినిపించింది. శేఖర్ మాస్టర్ చేసేటటువంటి ఎంకరేజ్ అంతా అంతా కాదు.. కేవలం జాను పేరు వినిపిస్తే చాలు శేఖర్ మాస్టర్ ప్రస్తావన వస్తూ ఉంటుందనేలా కనిపిస్తూ ఉంటుంది.


అయితే ఇప్పుడు జాను కేవలం డాన్స్ స్థాయి నుంచి డాన్స్ షోలు చేసే షోలకు జడ్జిగా పేరు సంపాదించింది. వీటితోపాటుగా కవర్ సాంగులు కూడా చేస్తూ ఉంది జాను. ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ, డాన్స్ ఐకాన్ 2 వంటి షోలలో కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే గత కొద్ది రోజుల నుంచి బిగ్ బాస్ సీజన్ 9 లో లేడీ కంటెస్టెంట్ గా పాల్గొనబోతోందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయం పైన తాజాగా జాను క్లారిటీ ఇవ్వడం జరిగింది.


కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ మొదటి సీజన్లో కనిపించిన వారు దాదాపుగా బిగ్ బాస్ హౌస్ లో కనిపించారు.. ఇప్పుడు రెండో సీజన్ లో యాంకర్ నిఖిల్, జబర్దస్త్ ఐశ్వర్య, జబర్దస్త్ ఇమ్మానుయేల్, భావన లాస్య, అనాలా సుస్మిత తదితరులు బిగ్ బాస్ సీజన్ లో కన్ఫర్మ్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే శేఖర్ మాస్టర్ శిష్యురాలు అయిన జాను కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వినిపించగా.. ఈ విషయం పైన జాను మాట్లాడుతూ తాను బయట ప్రపంచాన్ని వదిలేసి బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వెళ్తాను వెళ్ళను.. కావాలంటే రాసి పెట్టుకోండి అంటూ ఎంత డబ్బులు ఇచ్చినా జానుని కొనలేరు అంటూ కామెంట్స్ చేసేది.

మరింత సమాచారం తెలుసుకోండి: