తెలుగు బుల్లితెరపై యాంకర్ రవి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో షోలకు యాంకర్ గా  చేసిన రవి ఆ క్రేజ్ తో సినిమాలలో హీరోగా కూడా నటించారు. అయితే ఇటీవలే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ విషయాలకు సంబంధించి తెలియజేశారు.


యాంకర్ రవి మాట్లాడుతూ తాను ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తి అయిన తర్వాత ఆర్మీకి సెలెక్ట్ అయ్యానని కానీ రెండేళ్లు ట్రైనింగ్ కూడా తీసుకున్నానని అయితే కొన్ని కారణాల చేత ఆర్మీని వదిలేయాల్సి వచ్చింది అంటూ తెలిపారు. నానమ్మ కర్ణాటిక్ హిందుస్థాని సింగర్ అని చాలా బాగా సంగీతం నేర్పించేది.. అలా తనకి కూడా అలాంటి కలల పైన చాలా ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ అందులో డబ్బులు రావురా.. నీకు ఒకవేళ గౌరవం కావాలి అంటే దేశ సేవ చేయాల్సిందే అంటూ తెలిపిందట.. చిన్న వయసులోనే మారక్పల్లిలో ఉండే ఒక మిలిటరీ ఏరియాకి తీసుకువెళ్లి అక్కడ ఇంటికి కల్నల్ అనే పేరు చూపించి చూశావా ఆర్మీ కి వెళ్తే ఇంత పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు అంటూ తన నానమ్మ చెప్పిందని తెలిపారు రవి.


తన స్నేహితులందరూ కూడా ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ అంటూ అటువైపుగా వెళ్లగా తాను మాత్రం ఎన్డీఏ నేషనల్ డిఫెరెంట్ అకాడమీ లో కూడా చేరానని పరీక్ష పాసయి SSB ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేశాను లైఫ్ సెటిల్ అయిపోయింది.. ట్రైనింగ్ లో జుట్టు మొత్తం గోకేశారు.. ఉదయం 4గంటల నుంచి ట్రైనింగ్.. ప్రతి సంవత్సరం మూడు నెలలకు ఒకసారి 11 రోజులు మాత్రమే ఇంటికి పంపించేవారు. అలా రెండేళ్ల తర్వాత ఇంటికి వచ్చినప్పుడు తన నానమ్మతో చాలా గొడవ జరిగిందని.. ఒక్కగానోక కొడుకువి ఆ ఉద్యోగం వదిలేసేయ్ అంటూ గొడవ పడింది.. చివరికి ఆ ప్రేమ చూసేసరికి తనకు కూడా ఏదోలా అనిపించింది అందుకే వదిలేశానని తెలిపారు.. మిలట్రీలో జ్వరం వచ్చిన పట్టించుకోరు.. ట్రైనింగ్ కచ్చితంగా చేయాల్సిందే.. ఆరోగ్యం బాగాలేదు అంటే కచ్చితంగా అక్కడ ఒక నేరంగా చూస్తారు.. అలాంటి ప్లేస్ లోనుంచి కేరింగ్ వైపు చూసేసరికి తనకి ఆర్మీ వైపుగా వెళ్లాలనిపించలేదని తెలిపారు. అయితే తండ్రి ఎంత చెప్పినా కూడా తాను వెళ్ళనని మారం చేశాను తన జీవితంలో తీసుకున్న వరస్ట్ నిర్ణయం అదే అని ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: