టాలీవుడ్ లో సీనియర్ నటి గా పేరుపొందిన పూజిత తన కామెడీ టైమింగ్ తో అప్పట్లో పలు చిత్రాలతో ప్రేక్షకులను బాగా అలరించింది. ముఖ్యంగా ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ అనే సినిమాలో ఈమె నటన అద్భుతం. అలా సుమారుగా 140 పైగా చిత్రాలలో నటించిన పూజిత ఈ మధ్యకాలంలో సీరియల్స్లలో నటించి బాగా గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఈమె వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నట్టుగా వెల్లడించింది. విజయ్ గోపాల్ అనే వ్యక్తిని వివాహం చేసుకోగా.. వీరికి ఒక బాబు కూడా జన్మించారు.


తన కుమారుడికి 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన భర్త విజయ్ గోపాల్ ఈమెను వదిలేసి వేరే వివాహం చేసుకున్నారు.దీంతో నటి పూజిత పరిస్థితి చాలా ఘోరంగా మారింది. అయితే విజయ్ గోపాల్ మాత్రం కేవలం తాను పూజితతో సహజీవనం చేశానని వివాహం చేసుకోలేదని చెప్పడంతో మరింత హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత విజయ్ గోపాల్ 28 ఏళ్ల వయసు ఉన్న ఒక మహిళ ఐఏఎస్ ని వివాహం చేసుకోవడంతో ఆ విషయం మరింత వైరల్ గా మారింది.


విజయ్ గోపాల్ మీడియా వ్యక్తి కావడం చేత ఎలాంటి ఆధారాలు లేకుండా చేశారని నటి పూజిత చాలాసార్లు వెల్లడించింది.. ఒక రాత్రి అతనితో జరిగిన సంఘటనను గుర్తుచేసుకొని అతడికున్న వ్యాధి గురించి వెల్లడించింది పూజిత. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విజయ్ గోపాల్ ని తన భర్త అనడం తనకి ఇష్టం ఉండదని.. తనని విజయ్ అనే పేరుతోనే పిలుస్తా ఒకరోజు సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి.. విజయ్ బెడ్ షీట్ ముసుగు వేసుకొని నిద్రపోతున్నట్టుగా నటించారు.. అయితే అప్పటికే అతని ఫోన్ కి మెసేజ్ ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి.. అయినా తీయకుండా ఉన్నారు ఏంటబ్బా అని మొబైల్ వైపు చూడక పావని అనేవారు మెసేజీలు కనిపించాయి.


సరేలే అని సైలెంట్ గా ఉంటే బెడ్ రూమ్ అంటూ మెసేజ్లు రావడంతో ఆశ్చర్యపోయాను.. తెల్లారితే అతని బర్తడే అతనికి కావాల్సినవన్నీ కొన్నాను.. సరేలే ఉదయం చూద్దామని ఆ మెసేజ్లను తన మొబైల్ కి పంపించుకోగా వాటన్నిటిని డిలీట్ చేశారని చాలా కంత్రి మైండ్ కిల్లింగ్ మైండ్ అంటూ తెలియజేసింది. వ్యాసనాల కోసం ఎన్నోసార్లు అప్పులు చేసి ఇంటికి వచ్చి తనని కొట్టేవారని తెలిపింది.. అయితే ఒకసారి యాక్సిడెంట్ విజయ్ కి అయినప్పుడు హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు అతనికి ఒక రోగం బయటపడిందని.. దానివల్ల అతనిని ముట్టుకోకూడదు, దగ్గరకు వెళ్ళకూడదు ,మాస్కులు పెట్టుకోవాలని వైద్యులు చెప్పారనీ వెల్లడించింది నటి పూజిత.

మరింత సమాచారం తెలుసుకోండి: