దేశంలో మొబైల్ రంగం శరవేగంగా దూసుకుపోతోంది. విదేశీ కంపెనీలకు అనుమతులు ఇవ్వడంతో ప్రపంచంలోని దిగ్గజ సంస్థలన్నీ భారత్ లో సేవలందించేందుకు ముందుకొస్తున్నాయి. ప్రపంచంలోనే జనాభాలో అతి పెద్ద రెండో దేశం కావడంతో ఇక్కడ మొబైల్ రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు టెలికం కంపెనీలన్నీ పోటీ పడుతున్నాయి. ఇటవీల రంగంలోకి దిగిన జియో సంచలనమే సృష్టిస్తోంది.