ఇటీవ‌ల కాలంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరుగుతూ వ‌స్తోంది. సమాచారమైనా, చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం, ఏ పనైనా కావచ్చు. ఇలా ఫోను లేకుండా రోజు గడవడం కష్టమే. అలాగే మెలకువగా ఉంటే చేతిలో, నిద్రపోతే పక్కలో ఫోన్ ఉంచుకుంటున్నారు.  నేటి అవసరాలు, ఆధునిక టెక్నాలజీ కారణంగా స్మార్ట్ ఫోన్ ను పక్కన పెట్టే పరిస్థితి లేదు. మ‌రియు స్మార్ట్ ఫోన్‌తోనే అనేక పనులను ఇంటి నుండే చేసేస్తున్నాం. అందరూ దీనికి బాగా అడిక్ట్ అయిపోయారు. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. మీరు తలచుకుంటే మీ చేతిలోని ఆండ్రాయిడ్ ఫోన్ పూర్తిస్థాయి కంప్యూటర్‌లా కూడా మారిపోగలదు. 

 

అప్పడు మీ డివైస్‌ను మానిటర్, కీబోర్డ్ ఇంకా మౌస్‌లకు కనెక్ట్ చేసుకని ఎంచక్కా పూర్తిస్థాయి కంప్యూటింగ్‌ను ఆస్వాదించవచ్చు. అది ఎలాగో చూసేయండి మ‌రి. మార్కెట్లో అందుబాటులో ఉన్న Andromium అనే ఆపరేటింగ్ సిస్టం ద్వారా ఈ ప్రక్రియ సాధ్యమవుతోంది. ఈ ఆపరేటింగ్ సిస్టం మీ స్మార్ట్‌ఫోన్‌లో రన్ అవ్వాలంటే మీ డివైస్ Snapdragon 800 అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉండాలి. మ‌రియు ర్యామ్ కెపాసిటీ కూడా 2జీబికి మించి ఉండాలి. ఇక ఆండ్రాయిడ్ ఫోన్‌ను కంప్యూటర్‌లా మార్చేవేసే ప్రొసీజర్ చూస్తే.. ముందుగా Andromium OS యాప్‌ను గూగుల్ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి.

 

ఇక యాప్ ఇన్‌స్టాల్ అయిన వెంటనే ఫోన్‌ను రీస్టార్ట్ చేయవల్సి ఉంటుంది. ఫోన్ తిరిగి ఆన్ అయి యాప్ ఓపెన్ అయిన తరువాత "App Usage Access" ఆప్షన్‌ను ఓకే చేసి యాక్సిస్ కల్పించాల్సి ఉంటుంది. ఆ తరువాత యాప్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌లను యాక్సిస్ చేసుకునేందుకు యాప్ నోటిఫికేషన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత Andromium OS యాప్ హోమ్ స్ర్కీన్ పై "OK" బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు నోటిఫికేషన్ ప్యానల్‌ను ఓపెన్ చేసి చూసినట్లయితే Andromium OS మీ ఫోన్‌లో రన్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఆ నోటిఫికేషన్ పై క్లిక్ చేసినట్లయితే Andromium OS మీ ఫోన్‌లో విజయవంతంగా లాంచ్ అవుతుంది. దీంతో మీ ఫోన్ కంప్యూటర్‌లా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: