
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్ద అయినా వివో.. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాంటి వివో బ్రాండ్ ఇప్పుడు మరో అద్భుతమైన సరికొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది.. అయితే ఆ స్మార్ట్ ఫోన్ ఏంటి ? దాని ఫీచర్లు ఏంటి ? స్పెసిఫికేషన్లు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి..
మే 12 వ తేదీన అంటే రేపు వివో బ్రాండ్ వి 19 స్మార్ట్ ఫోన్ ను మన దేశంలో అధికారకంగా లాంచ్ కానుంది. అయితే అసలు ఈ స్మార్ట్ ఫోన్ మర్చి 26 వ తేదీనే లాంచ్ కావాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ అవ్వడంతో వాయిదా పడ్డాయ్. అయితే ఇప్పుడు ఈ-కామర్స్ కార్యకలాపాలకు అనుమతినివ్వడం, ఆఫ్ లైన్ రిటైలర్లు సేవలు ప్రారంభించటంతో ఈ ఫోన్ ని లాంచ్ చెయ్యాలి అని నిర్ణయించింది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు చూద్దాం.
వివో వి19 ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు!
6.44 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే.
ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్,
48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్ + 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగా పిక్సెల్ మాక్రో షూటర్ కెమెరా.
32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,
4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది.
ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ మిస్టిక్ సిల్వర్, పియానో బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉండనుంది.
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.25,000గా ఉండనుంది.
చూసారుగా.. రేపే ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది.