మార్కెట్ లో ఫోన్లు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే యువత కొత్త ఫోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు..  అయితే ఇప్పటికీ వరకు మార్కెట్ లోకి వచ్చిన ఫోన్ల ర్యామ్ సైజ్ కొద్దిగా తక్కువగా ఉండేది..8 జిబీ లేదా 16 జీబీ వరకు ఉండటం చూసి ఉంటాము కానీ ఇప్పుడు అది 18 జీబి వరకు పెరిగింది. అవును మీరు విన్నది నిజమే అదేంటో పూర్తి వివరాలను ఒకసారి తెలుసుకుందాం.


స్మార్ట్ ఫోన్లలో రెడ్ మ్యాజిక్ 6 ప్రోకి 18GB ర్యామ్ ఉంది. ఇలాంటి ఫోన్ ప్రపంచంలో ఇదే మొదటిది. ఈ ఫోన్ మీ సొంతమైతే... ప్రపంచంలోని ది బెస్ట్ యాక్షన్ గేమ్స్ అన్నీ ఈ అరచేతుల్లో కదులుతాయి...ఈ ఫోన్ పీచర్లను ఒకసారి పరిశీలిస్తే..  ఈ రెండు స్మార్ట్ ఫోన్లకూ అమోల్డ్ స్క్రీన్ ఉంది. రీఫ్రెష్ రేట్ 165 హెచ్ జెడ్ ఉంది. ఈ మొబైల్స్‌కి టచ్ కొరియోగ్రాఫర్ టెక్నాలజీ ఉంది.. ఇదో రకమైన ఇంటెలిజెంట్ అడాప్టివ్ టెక్నాలజీ. మీరు ఫోన్‌ను వాడే విధానాన్ని బట్టీ ఇది సరైన కచ్చితమైన రీఫ్రెష్ రేట్‌ని ఎంచుకుంటుంది. అందువల్ల చూడటానికి చక్కటి ఎక్స్‌పీరియన్స్‌తోపాటూ... బ్యాటరీ సేవ్ అవుతుంది.


రెడ్ మ్యాజిక్ 6 స్మార్ట్ ఫోన్... బ్లాక్, పల్స్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. దీని రేటు 3,799 యువాన్లు... అంటే మన కరెన్సీలో రూ.42,760
ఇక రెడ్ మ్యాజిక్ 6 ప్రో.. బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. దీని రేటు 4,399 యువాన్లు... అంటే మన కరెన్సీలో రూ. 49,510 వరకు ఉంటుంది.మార్చి 11 నుంచి చైనాలో సేల్స్ ప్రారంభమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి 16 నుంచి అమ్మకాలు జరుపుతామని కంపెనీ పేర్కొన్నారు. రియర్ కెమెరాలు 3 ఉన్నాయి. మెయిన్ కెమెరా 64మెగా పిక్సెల తో ఉంది. 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా ఉంది. ఫ్రంట్ సైడ్ 8మెగా పిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరా ఉంది.రెడ్ మ్యాజిక్ 6 ప్రోకి 4500mAh బ్యాటరీ120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఉండగా... రెడ్ మ్యాజిక్ 6కి 5050mAh బ్యాటరీ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది... ఏదీ ఏమైనా వీటికి ఇప్పటి నుంచే డిమాండ్ భారీగా పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: