ఫేమస్ సోషల్ మీడియా సైట్ మెటా సొంత యాప్ వాట్సాప్‌ ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లతో తన యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఇక ఈ కొత్త ఏడాదిలో మరో సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ ని వాట్సాప్ యూజర్స్ కోసం తీసుకొస్తోంది. అదే గ్లోబల్ వాయిస్ నోట్ ప్లేయర్ అనే ఫీచర్.. మీ చాట్ బాక్సులో వేర్వేరు చాట్ స్ర్కోల్ చేస్తూనే మీరు వాయిస్ మెసేజ్ కూడా వినొచ్చు. అలాగే ఏదైనా చాట్‌లో వాయిస్ మెసేజ్ ఉంటే ఇక ఆ మెసేజ్ ఓపెన్ చేసిన తర్వాత అలానే ప్లే అవడం జరుగుతుంది. అలాగే మీరు మరో చాట్ ఓపెన్ చేసినప్పటికీ కూడా వాయిస్ నోట్ ప్లేయర్ ప్లే అవుతూనే ఉంటుంది. ఇక ఇప్పటివరకూ కూడా వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ ఆ చాట్ లో మాత్రమే ఓపెన్ చేసి వినాల్సి ఉంటుంది. మరో చాట్ ఓపెన్ చేయాలంటే ఈ వాయిస్ మెసేజ్ ప్లే అనేది ఆగిపోతుంది.ఇక ఈ కొత్త ఫీచర్ వల్ల వాయిస్ మెసేజ్ అనేది కంటిన్యూగా ప్లే అవుతూనే ఉంటుంది.

 WABetainfo ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే .. మరో చాట్ ఓపెన్ చేసినా లేదా బ్యాక్ వెళ్లినా వాయిస్ మెసేజ్ బ్యాక్ గ్రౌండ్ లో ఇది ప్లే అవుతూనే ఉంటుంది.ఇక ఇప్పటికే ఈ గ్లోబల్ వాయిస్ నోట్ ఫీచర్.. కొన్ని iOS బీటా టెస్టర్ల కోసం విడుదల చేసింది వాట్సాప్ కంపెనీ. ఇక అందులో అయితే వాట్సాఫ్ బిజినెస్ బీటా యూజర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ గ్లోబల్ వాయిస్ నోట్ ప్లేయర్.. ఆండ్రాయిడ్ వాట్సాప్ బేటా పై డెవలప్ మెంట్ స్టేజ్‌లో ఉంది..ఇక ఎప్పుడు ఈ ఫీచర్ అఫీషియల్ గా రిలీజ్ అవుతుందో అనేది ఇంకా క్లారిటీ అనేది లేదు. ఇక వాట్సాప్ అప్ కమింగ్ ఫ్యూచర్ అప్‌డేట్‌లో iOS డివైజ్‌లపై Broadcast Lists New Group ఆప్షన్లను చాట్ లిస్టు నుంచి ఎత్తేసేందుకు కూడా ప్లాన్ చేస్తోంది. వాట్సాప్ వినియోగదారుల కాంటాక్టు లిస్టులో Broadcast అనే న్యూ ఎంట్రీ పాయింట్ అనేది ఉంటుంది. ఇక దానిపై వాట్సాప్ యూజర్ టాప్ చేయగానే టాప్ రైట్ సైడ్‌లో స్టార్ట్ న్యూ చాట్ అనే బటన్ కనిపిస్తుంది. ఇక ఈ ఫ్యూచర్ అప్‌డేట్ ప్లానింగ్ పై నివేదికలు వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు ఫీచర్ రిలీజ్ అవుతుందనే విషయం ఇంకా ఖచ్చితంగా తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: