కార్ ప్రమాదాలకు ముఖ్య కారణం ఏంటంటే భయం.బ్రేకులు ఫెయిల్ అయిన విషయం తెలిసిన వెంటనే చాలా మంది కూడా తీవ్ర భయాందోళనకు గురవుతారు. ఆ సమయంలో చాలా తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అందుకే ముందుగా భయాన్ని ఖచ్చితంగా నియంత్రించుకోవాలి. బ్రేకులు ఫెయిల్ అయినా కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలా సేఫ్ గా ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.అలాగే పార్కింగ్ లైట్లు (హాజార్డ్స్) అనేవి మీకు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించబడతాయి. వాహనం యొక్క పార్కింగ్ లైట్లు ఆన్ చేయడం ద్వారా, వెనుక వాహనంలో వచ్చే వారు మీ వాహనంలో సమస్య ఉందని ఈజీగా తెలుసుకుంటారు.అందువల్ల వారు మీ వాహనానికి కాస్త దూరంగా వెళ్లడమో? లేదా పక్కకు వెళ్లడమో? లేదా మీకేమైన సాయం చెయ్యడమో చేస్తారు.మీ కార్ బ్రేక్‌లు కనుక పని చేయకపోతే వెంటనే గేర్‌ మార్చండి. టాప్ గేర్ నుంచి నెమ్మదిగా గేర్లు మారుస్తూ ఫస్ట్ గేర్ వరకు మీరు తీసుకురావాలి. అప్పుడు వెంటనే వేగం తగ్గుతుంది. ఆటో మేటిక్ కారులో కూడా ఇదే పద్దతిని మీరు పాటించాల్సి ఉంటుంది. చాలా ఆటో మేటిక్ కార్లలో మాన్యువల్ సెట్టింగ్‌ లు అనేవి అందించబడ్డాయి. అప్పుడు మీరు గేర్‌లను ఒక్కొక్కటిగా తగ్గిస్తూ ఉండాలి. అంటే కారు 5వ గేర్‌లో ఉన్నట్లయితే, ముందుగా దానిని 4వ స్థానానికి తరువాత 3వ గేర్‌కి తగ్గించాల్సి ఉంటుంది.


వెంటనే టాప్ నుంచి ఫస్ట్ గేర్ లేదంటే సెకెండ్ గేర్ లోకి మార్చడం వల్ల ఇంజిన్ లో సమస్యలు వస్తాయి. అందుకే నెమ్మదిగా వన్ బై వన్ గేర్లు మార్చాలి. మీ కార్ బ్రేక్ ఫెయిల్ అయితే, కారును రోడ్డు మధ్యలో అలాగే అస్సలు నడపకూడదు. వెంటనే దానిని పక్కకు తిప్పాలి. రోడ్డు మధ్యలో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కారు వేగంగా ఉన్నప్పుడు కంగారుగా స్టీరింగ్‌ను పక్కకు తిప్పకూడదు.ఇక అత్యవసరం అనుకుంటేనే ఎమర్జెన్సీ హ్యాండ్ బ్రేక్ ను వాడాల్సి ఉంటుంది. ముందుగా పైన చెప్పిన పద్దతులను పాటించిన తర్వాత చివరగా హ్యాండ్ బ్రేక్ ని వాడాలి. ఇక అలా కాకుండా బ్రేకులు ఫెయిల్ అయిన వెంటనే కంగారు పడి.. వేగంగా వెళ్తున్న కారుకు మీరు హ్యాండ్‌ బ్రేక్‌ వేస్తే.. ఖచ్చితంగా కూడా రోడ్డు మీదే పల్టీ కొట్టే అవకాశం ఉంటుంది. మీ ఎదురుగా ఏదైనా వాహనం వస్తుంటే.. దాన్ని తప్పించడానికి కంగారు పడకుండా స్టీరింగ్‌ను స్లోగా పక్కకు తిప్పి ప్రమాదం నుంచి మీరు తప్పించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: