ఈ ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగడానికి సైతం మరో రెండు నెలల సమయం మాత్రమే ఉన్నది.. 2024 ఏడాది జరిగే ఎన్నికలలో దాదాపుగా 50 లక్షల మందికి పైగా కొత్త ఓటర్లు తమ హక్కును వినియోగించుకోబోతున్నట్లు తెలుస్తోంది. నిన్నటి రోజున జాతీయ ఓటర్స్ డే సందర్భంగా చాలామంది రాజకీయ నాయకులు సైతం ప్రజలకు ఓటు హక్కు అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. 18 ఏళ్ల నిండిన యువకులు ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చంటూ తెలిపారు. ఓటు వేయాలంటే కచ్చితంగా ఓటర్ కార్డు ఉండాల్సింది అయితే ఓటర్ కార్డు లేని వారు ఇలా చేస్తే ఓటర్ కార్డు తీసుకోవచ్చు.


1).ముందుగా భారతీయ ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ కి వెళ్లి అక్కడ..NVSP అనే వాటి పైన క్లిక్ చేయాలి..


 2).కొత్త ఓటర్ నమోదు కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది.


3).అక్కడ పుట్టిన తేదీతో పాటు జనన ధ్రువీకరణ పత్రం, పూర్తి చిరునామాను అందించాలి.. ఆ తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది..


దరఖాస్తు చేసిన తర్వాత ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారి ఈమెయిల్ కు ఐడి వస్తుంది.. ఈమెయిల్ పైన ఒక లింకు కలిగి ఉంటుంది.. దాని ఆధారంగా అభ్యర్థి యొక్క ఓటర్ కార్డు గుర్తింపును రూపొందిస్తారు. అలా వచ్చిన నెల రోజులకే ఓటర్ ఐడి కూడా ఇంటికి పంపిస్తారు. అయితే ఓటర్ కార్డుకు కావలసిన పత్రాల విషయానికి వస్తే..


1).ఓటర్ కార్డ్ అప్లై చేసే వారి యొక్క ఆధార్ కార్డు..
2).అలాగే జనన ధ్రువీకరణ పత్రంతోపాటు రేషన్ కార్డు కూడా అవసరం.
3). ఎవరి దగ్గరైనా పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్సు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు.
4). ముఖ్యంగా ఓటర్ కార్డ్ ఆధార్ కార్డు లింక్ అప్ అనేది కచ్చితంగా చేయించాలి ఇలా చేయని యెడల మీ ఓటర్ కార్డు తిరస్కరించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: