
ఆ తర్వాత మూడు దశల ద్వారా స్వచ్ఛమైన బంగారాన్ని మన సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ వస్తువుల వినియోగం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ఇతర దేశాలతో పోల్చి చుస్తే మన దేశ జనాభా ఎక్కువనే సంగతి తెలిసిందే. అదే సమయంలో ఈ వేస్ట్ సైతం ఊహించని స్థాయిలో పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.
యూఎన్ గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ లెక్కలను బట్టి ప్రపంచ దేశాల్లో ఐదు రేట్లు ఏకంగా పెరుగుతోంది. 2022 సంవత్సరంలో ఏకంగా 62 మిలియన్ టన్నుల ఈ వేస్ట్ తయారైందని సమాచారం అందుతోంది. 2010 సంవత్సరంతో ఉన్న ఈ వేస్ట్ తో పోలిస్తే ఏకంగా 82 శాతం ఈ వేస్ట్ పెరగడం సంచలనం అవుతోంది.
2030 సంవత్సరం నాటికి ఈ వేస్ట్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వేస్ట్ వల్ల పర్యావరణానికి ఊహించని స్థాయిలో నష్టం కలిగే అవకాశం ఉంది. గోల్డ్ డిసల్యూషన్, గోల్డ్ బైండింగ్, గోల్డ్ రికవరీ విధానాల ద్వారా గోల్డ్ రికవరీ చేసే అవకాశం ఉంది. ట్రైక్లోరోఐసోసయాన్యూరిక్ యాసిడ్ సహాయంతో ఈ వేస్ట్ లో ఉన్న బంగారం కరిగిస్తారు. పాలిసల్ఫైడ్ పాలిమర్ సర్బెంట్ ద్వారా సైతం బంగారాన్ని కరిగించే ఛాన్స్ అయితే ఉంటుంది. పైరలైజింగ్ లేదా డీపాలమరైజింగ్ ద్వారా సైతం బంగారాన్ని కరిగించవచ్చు.