ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా ఇట్టే తెలుసుకోగలుగుతున్నాడు మనిషి. అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్తోనే ప్రపంచ దేశాలు అన్నింటిని కూడా చుట్టేయగలుగుతున్నాడు అని చెప్పాలి. అయితే ఇలా సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో రకాల ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే వింతలు విశేషాలు కూడా కొన్ని కొన్ని సార్లు ఇంటర్నెట్ జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయని చెప్పాలి. ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయా అనే ప్రతి ఒక్కరు కూడా అవాక్కవుతూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. పంచభూతాల్లో ఒకటిగా కొనసాగుతున్న నీరు నిప్పు ఎప్పుడూ కలవలేవు. ఎందుకంటే నిప్పును ఆర్పేందుకు నీరును ఉపయోగిస్తూ ఉంటారు. ఎంత పెద్ద మంటనైనా సరే నీటితో ఎంతో సింపుల్ గా ఆర్పేయవచ్చు అని చెప్పాలి. ఇది ఎవరో చెప్పడం కాదు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే ఇలా నీరు చేతిలో ఉందంటే నిప్పును ఆర్పేయవచ్చు అని ప్రతి ఒక్కరు నమ్ముతారు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు అని చెప్పాలి. ఎందుకంటే ఈ వీడియోలో ఏకంగా నీటిపై మంటలు ఎగసిపడుతున్నాయి. మరో ప్రాంతంలో ఏకంగా నీరు మరుగుతూ కనిపించడం కూడా ఈ వీడియోలో చూడవచ్చు.


 అయితే వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే అది ఒక పెద్ద నది ప్రవాహం నుంచి వేరుపడిన కాలువల కనిపిస్తుంది. అయితే ఎవరో ఏకంగా నీటి కింద మంట పెట్టి మరిగిస్తున్నట్లుగానే నీరు ఉడుకుతూ కనిపిస్తుంది. అంతే కాదు ఒకచోట ఏకంగా గ్యాస్ సిలిండర్ పెడితే ఎలా అయితే మంటలు ఎగసిపడతాయో.. నీటిలోంచి అదే రేంజ్ లో మంటలు ఎగసిపడటం కూడా చూడవచ్చు. ప్రపంచంలోని మోస్ట్ డేంజరస్ నదులలో ఒకటైన దక్షిణాఫ్రికాలోని వాల్ నదిలో ఈ షాకింగ్ దృశ్యం కనిపించింది. నీటిలో ఉన్న మిథైన్ వాయువుకు ఎవరో నిప్పు అంటించారని..అదే ఇలా నదిలో మంటలు రావడానికి కారణమని ఎంతోమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.  ఏది ఏమైనా ఇలా నీటిపై మంటలు రావడం మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: