హిందూమతంలో ఏకాదశి తిథీకి చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది.. ముఖ్యంగా విజయ ఏకాదశికి ఉండే స్థానం చెప్పాల్సిన పనిలేదు.. శ్రీమహావిష్ణువు అత్యంత ఇష్టమైన రోజునే విజయ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు.. ఈ విజయ ఏకాదశి నాడు ఎవరైతే శ్రీ మహావిష్ణువును సైతం పూజిస్తారో వారికి విజయాలను కూడా పొందుతారు.. ఈ సంవత్సరం విజయ ఏకాదశి ఈ రోజు( మార్చి -6..2024 ) జరుగుతుంది. ఈరోజు ఉదయం 6:33 నిమిషాలకు ప్రారంభమై మార్చి 7వ తేదీన 4:16 నిమిషాలకు తెల్లవారుజామున ముగుస్తుందట.


ఇబ్బందికర పరిస్థితుల నుంచి వ్యక్తులను విజయ బాట నడవాలి అనుకునేవారు..ఈ విజయ ఏకాదశి రోజున ఎవరైనా ఉపవాసం ఉంటారో వారికి అన్ని ప్రయత్నాలలో కూడా విజయాన్ని  అందుకుంటారు.. ముఖ్యంగా ఈ రోజున విశిష్టత ఏమిటంటే.. శ్రీరామచంద్రుడు సీతాదేవి రావణుని చెర నుండి విడిపించడానికి విజయం సాధించడానికి ఉపవాసం చేయడాన్ని విజయ ఏకాదశి ప్రాధాన్యత అని చెప్పవచ్చు.. ఈ రోజున ఉదయం లేవగానే స్నానం చేసి ఆ నీటిలో కాస్త ఉసిరికాయలను వేసుకుంటే మరింత పుణ్యం లభిస్తుంది.. శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు శుభప్రదమైన రోజుగా పరిగణిస్తున్నారు పండితులు..


ఈ విజయ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తారో వారికి కచ్చితంగా విజయాన్ని అందుకుంటారు. చదువులోనైనా వ్యాపారంలోనైనా మరి ఇతర లక్ష్యాలలో విజయాన్ని సాధించాలంటే ఈ రోజున ఉపవాస వ్రతాన్ని కచ్చితంగా ఆచరించడం మంచిది.. విజయ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల ఎన్నో పాపాలు పోయి పుణ్యాలు కూడా లభిస్తాయి.. విజయ ఏకాదశి వ్రతం కూడా ఎంతో మంది భక్తులకు మోక్షాన్ని అందిస్తోంది.. ఈ రోజున విష్ణువును పూజించడం వల్ల సానుకూల శక్తి లభిస్తుంది.మానసిక ప్రశాంతత కూడా లభించడమే కాకుండా అన్ని పనులు విజయవంతంగా కలుగుతాయి.. అందుకే ఈ విజయ ఏకాదశి రోజున చాలామంది ఎన్నో పద్ధతులలో జరుపుకుంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: