ఈ ప్రపంచంలో ఎక్కువమంది భయపడే ప్రాణి ఏదైనా ఉంది అంటే అది పాములే అని చెప్పాలి  ఎందుకంటే విషపూరితమైన సర్పాలు ఒక్క కాటుతో ఏకంగా ఆరడుగుల మనిషిని సైతం చంపేయగలవు. అందుకే పాములను చూస్తే ఎంతటి వారైనా సరే భయపడిపోతూ ఉంటారు. ఏకంగా విషపూరితమైన సర్పాలు కనిపించాయి అంటే చాలు అక్కడి నుంచి పరుగో పరుగు అంటూ ఉంటారు.


 అయితే కొంత మంది ఏకంగా విషపూరితమైన సర్పాలతోనే ఆటలాడుతూ ఉంటారు.  కొన్ని కొన్ని సార్లు ఇలాంటి పిచ్చి చేష్టలు చేసి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఈ మధ్య కాలం లో సోషల్ మీడియా లో ఇలా పాములకు సంబంధించిన ఎన్నో వీడియోలు తెర మీదికి వస్తూ వైరల్ గా మారిపోతాయ్. అయితే చాలా మంది స్నేక్ క్యాచర్లు  విషపూరితమైన పాములను సైతం ఎంతో చాకచక్యంగా పట్టుకుంటున్న వీడియోలు చూసి ఎంతో మంది నేటిజన్స్ షాక్ అవుతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పాములతో ఆటలాడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది.


 వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి టేబుల్ పై తల పెట్టుకుని పడుకుని ఉంది. అయితే ఆమె తన జుట్టును ముడి వేసుకొని క్లిప్ పెట్టుకుంటుంది. ఇక ఆ జుట్టులో ఒక సన్నటి పాము కదులుతూ ఉండడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఏకంగా జుట్టులో అది కదులుతూ పైకి వెళ్తూ ఉంటుంది  అయితే మహిళ జుట్టుకు పూర్తిగా చుట్టుకున్న పాము వెనకవైపు నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఈ వీడియో చూసి నేటిజన్స్ షాక్ అవుతున్నారు  అయితే  ఆ పాము అలా యువతి తలలో పాకుతుంటే యువతి మాత్రం ఏమీ జరగనట్లుగానే హాయిగా నిద్రపోతూ ఉండడం చూసి అందరూ షాక్ అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: