కొన్ని సందర్భాలలో ఆకాశంలో వింతలు జరుగుతూ ఉంటాయి. వాటిని చూడడానికి ప్రజలు కూడా మక్కువ చూపుతో ఉంటారు. అయితే ఈ రోజు నుంచి ఖగోళ అద్భుతం జరగబోతోంది. ఈనెల 14న వరకు మిట్ట మధ్యాహ్నం మనిషి నీడ రెండు నిమిషాల పాటు కనిపించదట. ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్స్ సర్చ్ క్యాంపెయిన్ వారు ఈ విషయాన్ని నిన్నటి రోజున తెలియజేశారు. ఈ పరిణామాన్ని జీరో షాడో గా కూడా వ్యవహరిస్తారని తెలియజేశారు. సాధారణంగా నీడ మనిషికి ఏదో ఒకపక్క మాత్రమే కనిపిస్తూ ఉంటుంది.



అయితే ఈనెల 14వ తేదీ వరకు మాత్రం కొన్ని ప్రాంతాలలో సూర్యకాంతి మన మీద లంబంగా పడడం వల్ల మన నీడ మాయమవుతుందట. భూమి అక్షం 23.5 డిగ్రీల వంపుతో ఉండడం వల్ల సూర్యుని చుట్టూ  భ్రమణం  చేసే సమయంలో కూడా సూర్యుని స్థానం అటు ఉత్తర ,దక్షిణ దిశలలో మారుతూ ఉంటాయని తెలియజేస్తున్నారు. ప్రతి ఏటా రెండు సందర్భాలలో కర్కట ,మకర రేఖల మధ్య ఉండేటువంటి ప్రదేశాలలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందట. మధ్యాహ్న సమయాలలో సూర్యకిరణాలు భూమిపైన సంపూర్ణ లంబ యాంగిల్ లో పడతాయట.


అందువల్లే నిలువు వస్తువుల మీద రెండు నిమిషాల పాటు పూర్తిగా నీడ మాయమవుతుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. దీనిని సుసత్య రేఖ అని కూడా అంటారని తెలుపుతున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. సూర్యుని కదలికలు స్థానాన్ని బట్టి అద్వైతం చేసిన వాటిని జీరో షాడో గా ఉపకరిస్తుందంటూ సు సత్య రేఖ అని పిలుస్తారని తెలియజేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ కొన్ని రోజులపాటు ఈ వింతని మనం చూడవచ్చు అని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. మరి ఇది ఏ ఏ ప్రాంతాలలో వస్తుందో చూడాలి మరి. మొత్తానికి ప్రజలు కూడా ఇలాంటి వాటిని చూడడానికి మరింత ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: