
బాధితురాలు పోలీస్ కంప్లైంట్ లో తెలిపిన వివరాలు ప్రకారం .."ఆమె అనారోగ్యంగా ఉండడంతో మే 21వ తేదీ మైసూర్ కు వెళ్లడానికి సిద్ధమయిందట. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 12:00 - 12:30 గంటల మధ్య ఆ సమయంలో గ్యాస్ డెలివరీ బాయ్ వచ్చి మీకు గ్యాస్ వచ్చింది అంటూ చెప్పారట . అయితే ఆమె నేను గ్యాస్ బుక్ చేయలేదు .. మరి ఎలా వచ్చింది అని తిరిగి క్వశ్చన్ చేసిందట. " గ్యాస్ బుక్ చేయకపోయినా సరే కొన్నిసార్లు ఇలా గ్యాస్ మిగిలిపోయినప్పుడు ఎవరికైనా కావాలి అంటే ఇస్తాము గ్యాస్ బుక్ చేయకపోయినా మీరు గ్యాస్ తీసుకోవచ్చు ..మీకు అవసరమైతే తీసుకోండి" అంటూ కూల్ గా మాటలు కలిపేశాడట .
ఆమె గ్యాస్ తీసుకోవడానికి ఒప్పుకుందట . గ్యాస్ తీసుకోవాలి అంటే కేవైసీ ఖచ్చితంగా చేయాలి అని గ్యాస్ సిలిండర్ దగ్గర నిలబడి ఒక ఫోటో తీసుకోవాలి అంటూ ఆమెను పక్కన నిలుచోపెట్టి ఫోటో తీసుకున్నారట. అంతే కాదు సెంట్రల్ గవర్నమెంట్ కొత్త ఆర్డర్ ఇది.. కిచెన్లో గాలి సరిగ్గా వస్తుందా లేదా లేకపోతే గ్యాస్ ఏదైనా లీక్ అవుతుంది ఏమో చెక్ చేయాలి అంటూ ఇంట్లోకి వెళ్లేలా మాయమాటలు చెప్పాడట . నమ్మేసిన మహిళ మహేష్ ని ఇంట్లోకి తీసుకొని వెళ్లి గ్యాస్ చెక్ చేయిస్తూ ఉండగా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడట డెలివరీ బాయ్.
అరిస్తే కత్తితో పొడుస్తా అంటూ ఆమెపై లైంగిక దాడికి లైంగిక దాడికి పాల్పడ్డాడట. ముఖంపై కూడా కొట్టాడట . కత్తితో పలుచోట్ల గాయపరుస్తూ అక్కడ నుంచి పారిపోయారట. మహేష్ దాడిలో గాయపడ్డ ఆ బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటుంది . ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించింది . మహేష్ పై అత్యాచారం కేసు పెట్టి కేసు నమోదు చేసుకున్నారు కర్ణాటక పోలీసులు . మహేష్ కోసం గాలిస్తున్నారు . ఎవరైనా సరే ఇలా గవర్నమెంట్ కొత్త రూల్ అంటూ ఇంట్లోకి రావాలి అని ప్రవేశించిన.. మీకు అలా ఏ వ్యక్తిపై అనుమానం కలిగిన వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి అంటూ చెప్పుకొస్తున్నారు అధికారులు..!