ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ చూడదగ్గ విచిత్ర వాతావరణం నెలకొంది ఒకవైపు తీవ్ర ఎండలు మరోవైపు మోస్తారు వర్షాలు వస్తున్నాయి .. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పగలు ఎండలు  ,ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు .అలాగే ఈ వర్షాలతో తగ్గిన ఉష్ణోగ్రతలు మళ్లీ భారీగా పెరిగిపోతున్నాయి. ఋతుపవనాల ,మందగమనం ,రోహిణి కార్తె ప్రభావంతో ఎండలు భారీగా పెరిగాయి ఋతుపవనాలు మందగించడంతోపాటు నాలుగు రోజులుగా ఎండలు భారీగా పెరుగుతున్న వాతావరణ శాఖ చెబుతుంది. అలాగే చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది ..


అలాగే రోహిణి కార్తీ ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగినట్లు వాతావరణ కేంద్రం చెప్పుకొచ్చింది .ఈ గురు, శుక్రవారాల్లో పలు జిల్లాలో 41 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని చెప్పింది.. అలాగే ఆంధ్రప్రదేశ్లో రాగల రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో క్రమంగా రెండు నుంచి 3 డిగ్రీలు మేర పెరిగే అవకాశం ఉందని కూడా అంటుంది ..

 

ప్రధానంగా ఈ గురు, శుక్రవారాల్లో విజయనగరం, అల్లూరి సీతారామరాజు ,కాకినాడ ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు ,కృష్ణాజిల్లాలో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్య అవకాశం ఉంది .అలాగే పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల తేలికపాటి మోస్తారు వర్షాలు పడి అవకాశం ఉందని కూడా అంటున్నారు ..
అయితే నిన్న బుధవారం జంగమేశ్వరంలో ఏకంగా 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అవ్వగా నర్సాపూర్ 40.9, ఇలా పలు నగరాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి .


ఇదే క్రమంలో తెలంగాణలో సైతం ఎండలు దంచి కొడుతున్నాయి .నైరుతి రుతుమవనాలు కొంత వెనక్కు తగ్గడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పుకొచ్చింది .అయితే ఈ గురు, శుక్రవారం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30 నుంచి ,40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన  మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తుంది. అలాగే రాగల నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత స్వల్పంగా పెరుగుతాయని కూడా అంటుంది. అలాగే ఈరోజు గరిష్టంగా తెలంగాణలోని ,నల్గొండ భద్రాచలంలోని, పలు ప్రాంతాల్లో 38 నుంచి కనిష్టంగామహబూబ్ నగర్‌లో 34 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: