మనము ఏదైనా ఒక పనిని లేదా లక్ష్యాన్ని సాధించాలంటే అంత సాధారణమైన విషయం కాదు. దానికి ఎంతో తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. కొన్ని సమయాల్లో మనము ఎంత ప్రయత్నించినా అనుకున్న పనులు జరగకపోవచ్చు. ఒక ప్రణాళిక ప్రకారం వెళ్లినా సరే, సమయాన్ని సరిగా పాటించినా సరే కొన్ని అడ్డంకులు ఎదురయి ఆ ప్రయత్నంలో విఫలమవ్వొచ్చు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ, అతి ప్రధానమైన కారణం ఒకటుంది. మన యందు దేవుని దయ ఉండడం ఎంతో అవసరం. మన ప్రయత్నం ఎంత గొప్పదైనా దేవుని దయ మనపై లేకుంటే సదరు లక్ష్యాలను మనము చేరుకోలేము.  

ఉదాహరణకు మంచి పంటను పండించాలనుకుంటాము. దాని కొరకు అవర్షమయిన పనులన్నిటినీ సక్రమంగా చేస్తాము. అప్పుడు విత్తనాలు మొలకెత్తి పంటగా ఎదగడానికి మనం సమయం ఇవ్వాలి. కానీ ఇలా పంటను సరిగా కాపుడుకుంటూ వచ్చినప్పటికీ పంట చేతికొచ్చే సమయానికి ఏదో ఒక విధంగా పంట నాశనం అవుతుంటుంది. కాబట్టి మన ప్రయత్నం యందు దేవుని దయ ఉండడం కూడా చాలా ముఖ్యం. దేవుని దయ అనేది మన నియంత్రణలో లేని అంశం. అయితే మనము ఇప్పుడు ఆలోచించవలసినది ఏమిటంటే మనము ఆశించిన ఫలితాన్ని పొందాలంటే ఏమి చేయాలి.

 సృష్టిని మరియు దాని చట్టాలను పరిపాలించే దేవుని సహాయం కోరడం ద్వారా, ఎక్కువ జ్ఞానం మరియు విశ్వాసానికి దారితీసే మార్గాన్ని మనం పొందే అవకాశం ఉంటుంది. ఆయన కృపను స్వీకరించడానికి మనం కూడా సిద్ధపడి ఉండాలి. భగవంతుని మనము ప్రార్ధన చేయడమే అయన దయను పొందే ఏకైక మార్గం. ఈ విధంగా మనము దేవుడిని ప్రార్ధించడం మూలాన  శక్తివంతుడైన ఆయన మనకు దయను ప్రసాదిస్తాడు. భగవంతునికి తన భక్తుల యందు ఎప్పటికీ దయ కలిగి ఉంటాడు. భగవంతుడు కూడా తన భక్తుల కష్టాలలో ఎప్పుడూ తోడుగా ఉంటాడు. వారికీ ధైర్యాన్ని కలిగిస్తాడు. తద్వారా మనము దేనినైనా సాధించగలిగే విశ్వాసం వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: