మహిళల్లో కొందరికి స్వయంతృప్తి అలవాటు ఉంటుంది. అయితే కొందరు ఆ పని అతిగా ఈ పని చేస్తున్నానని భావిస్తుంటారు. అసలు ఈ స్వయంతృప్తికి లెక్క అంటూ ఉందా? ఎన్నిసార్లు చేస్తే ఆరోగ్యానికి హానికరం ? ఇలాంటి అనుమానాలు కలుగుతుంటాయి.

 

అయితే స్వయంతృప్తి అనేది ఆరోగ్యకరమైన, సహజసిద్ధమైన లైంగిక చర్య అంటున్నారు వైద్యులు. అయితే ఈ అలవాటు మీ దైనందిన జీవితాన్ని ఇబ్బంది పెడుతున్నా లేదా మీ జీవిత భాగస్వామితో లైంగిక జీవితానికి అడ్డంకిగా మారినా, కచ్చితంగా సెక్సాలజిస్ట్‌ సలహా తీసుకోవాలని చెబుతున్నారు.

 

అధిక శాతం మంది స్వయంతృప్తితో తమ లైంగిక కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. ఈ అలవాటు వల్ల లైంగిక వ్యాధులు సంక్రమిస్తాయోమో, గర్భం దాలుస్తామనే భయాలూ ఉండవు. కాబట్టి ఎవరైనా స్వయంతృప్తి జరపకుండా లైంగిక కోరికలను అణుచుకోవలసిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.

 

ఒకవేళ మీ అలవాటు దైనందిన జీవితానికి, లైంగిక సంబంధాలకూ ఇబ్బందికరంగా మారితే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రతించాలని చెబుతున్నారు. ఒకవేళ ఈ అలవాటు వల్ల జననావయవాలకు గాయాలవుతున్నా ఈ అలవాటును అదుపు చేసుకోక తప్పదు. స్వయంతృప్తి కోసం నిర్దేశించిన సురక్షితమైన సెక్స్‌ టాయిస్‌ ఇప్పుడు అందుబాటులో కొచ్చాయి కాబట్టి వైద్యుల సూచన మేరకు వాటిని వాడటం అన్ని విధాలా శ్రేయస్కరమని చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: