టమోటా క్యారెట్ పచ్చడి ఎప్పుడైనా తిన్నారా ? ఎంత బాగుంటుందో తెలుసా? అయితే ఆ టమోటా క్యారెట్ పచ్చడి ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి. ఇంట్లోనే ఈ వంటకం చేసుకొని తినండి. 

 

కావలసిన పదార్థాలు.. 

 

క్యారెట్‌ - 1, 

 

టమోటాలు - 2, 

 

పచ్చిమిర్చి - 4, 

 

వెల్లుల్లి - 4 రేకలు, 

 

పంచదార - అర టీ స్పూను, 

 

ఉప్పు - రుచికి తగినంత, 

 

నూనె - 2 టీ స్పూన్లు, 

 

ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, నూనె - సరిపడా.

 

తయారీ విధానం... 

 

కొద్ది నూనెలో పెద్ద ముక్కలుగా తరిగిన క్యారెట్‌, టమోటాలతో పాటు చిదిమిన పచ్చిమిర్చి సన్నటి మంటపై మగ్గించాలి. చల్లారిన తర్వాత వెల్లుల్లి, పంచదార, ఉప్పుతో పాటు గ్రైండ్‌ చేసుకోవాలి. తర్వాత తాలింపు కలపాలి. అంతే టమోటా క్యారెట్ పచ్చడి రెడీ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: