ఇక అత్యాధునిక ప్లాస్టిక్‌తోని తయారు చేసిన ఈ గాజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో వంట చెరకు నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ స్థాయిని గుర్తించే అత్యాధునిక సెన్సర్లు ఉంటాయి. వీటిని ధరించిన గర్భిణీ స్త్రీలను తగిన విధంగా అవి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంటాయి. మోతాదుకు మించిన కార్బన్ మోనాక్సైడ్ గుర్తించిన వెంటనే ఈ గాజులు ఎర్ర రంగులో వెలుగుతూ బీప్ శబ్ధాన్ని విడుదల చేస్తాయి. ఆ తర్వాత బయటకు పొమ్మని, సురక్షిత ప్రాంతానికి వెళ్లుమంటూ స్థానిక భాషలో హెచ్చరికలు జారీ చేస్తాయి.
ఇక కడుపుతో ఉన్నవారికి గాజులు బహుమతిగా ఇస్తుంటారు. దానికి గల కారణం గాజుల గలగలలు కడుపులోని బిడ్డకు ఉద్దీపనలను అందిస్తాయట. గాజుల సవ్వడి కడుపులోని బిడ్డకు మంచి సంగీతం లాగా అనిపిస్తుందిట. బిడ్డ లో వినికిడి సామర్థ్యాన్నిపెంచడంతో పాటు, గర్భిని స్త్రీ కి ఒత్తిడి, నిరాశ కలుగకుండా చేస్తాయట. గాజులు వేసుకునే స్త్రీల మీద చేసిన పరిశోధనల ప్రకారం.. సింథటిక్ పదార్థాలతో తయారు చేసిన గాజులు ధరించిన స్త్రీలలో భావోద్వేగాలు తక్కువగా కనిపించగా, మట్టిగాజులు, గ్లాస్ తో తయారు చేసిన గాజులు వేసుకున్న వారు మంచి చురుకైన భావోద్వేగాలతో కనిపించారట.
అయితే వాతావరణం నుంచి మంచి, స్వచ్ఛత ను గ్లాస్ తో తయారు చేసిన గాజులు మాత్రమే తీసుకుంటాయట. అందువల్ల మన చుట్టు పక్కల పరిసరాలు మనకు పాజిటివ్ గా అనిపిస్తాయి. చెడు ప్రకంపలను తిప్పి కొట్టి పాజిటివిటీని నిండేలా చేస్తాయట. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి స్త్రీ మట్టి గాజులు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి..గర్భవతి గా ఉన్నవారైతే చేతి గాజులు అస్సలు తీయకుండా నిండుగా ఉండేలా చూసుకోండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి