మహిళలు అంటే సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎవరో కొంత మంది మూర్ఖులు వారిని తక్కువగా చూస్తారు కానీ చాలా మంది మహిళలంటే గౌరవిస్తారు, వారి మాటలకు విలువనిస్తారు. ఆడ వారు అంటేనే సహనం అని, ప్రేమకు ప్రతిరూపం అని అంటుంటారు. అలాగే చాలా మంది మహిళలు నడుచుకుంటుంటారు. కానీ కొందరు మాత్రం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వారివారి జీవన శైలిని కూడా మార్చుకుంటున్నారు. మహిళ ఒక నిర్ణయం తీసుకోబోతుంది అంటే పది సార్లు ఆలోచించాలి, అదే వారి జీవితాలకు కీలకమైనది అయితే వెయ్యి సార్లు ఆలోచించినా తప్పులేదు. అయితే అది సరైందా కదా అన్నదే ముఖ్యం.

ఇలా ఎందుకు అంటున్నారు అంటే ఎవరికైతే సమాజంలో గౌరవ మర్యాదలు అందుతాయో..వారిపై ఈ సమాజం పట్ల బాధ్యత కూడా అదే విధంగా ఉంటుంది. వారు తీసుకునే ప్రతి నిర్ణయం మన సమాజం హర్షించేలా ఉండాలి. కానీ దూషించేలా ఉండకూడదు. అది సాధారణ వ్యక్తి అయినా సరే పెద్ద సెలబ్రిటీ అయినా సరే. నిర్ణయాలను తీసుకునే స్వాతంత్రం వారికి పూర్తిగా ఉంది. కానీ ఆ నిర్ణయం ఈ సమాజంలో ఎలా ప్రతిబింబిస్తుంది అన్న ఒక చిన్న ఆలోచన గురించి కూడా ఆలోచించాలి. కానీ ఎవరి నిర్ణయాలు వారివి, వారిని బాధించే వాటిని సమాజం కోసం భరించడం అంటే కష్టమే. కానీ ఏ నిర్ణయం అయినా కాస్త స్పృహతో యోచిస్తే ఆ తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉండదు.

కాబట్టి మీ నిర్ణయాలను అమలు చేసేముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలి. అన్ని సార్లు మీకు మీరే ప్రశ్నించుకుని, అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని అవి మీకు అన్ని విధాలుగా సరైనవి అనిపిస్తే ఇక ఎవరి గురించి ఆలోచించకుండా దైర్యంగా నిర్ణయం తీసుకోండి. ఇక ఎవరు ఏమన్నా మీ నిర్ణయాన్ని మీరు దైర్యంగా వ్యక్త పరచండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: