పల్సర్.. ఈ బైక్ ఎంత అందంగా.. ఎంత పెద్దగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఈ అద్భుతమైన బైక్ కంటే అందమైన బైక్ వచ్చేస్తుంది.. అతిపెద్ద ఇంజిన్ ట్యాంకు, మంచి పికప్, మెరుగైన మైలేజితో బైక్ ప్రియులను ఆకర్షించిన పల్సర్ కంటే కూడా అందమైన బైక్ వచ్చేస్తుంది అంటే నమ్మండి. 

 

బజాజ్ బైక్స్ లో బజాజ్ డోమినార్ 250 త్వరలోనే రాబోతుంది. 250 సీసీ ఇంజిన్ కలిగి ఉన్న ఈ బైక్ భారత విపణిలో విడుదల చేసేందుకు బజాజ్ ఆటో సంస్థ సిద్ధం అయ్యింది. తాజాగా బజాజ్ డోమినార్ 250 బైక్ ను మార్చిలో లాంచ్ చెయ్యనున్నారు. ఏప్రిల్లో ఈ బైక్ లాంచ్ చేసేందుకు ప్లాన్ సిద్ధం చెయ్యనున్నారు. 

 

అయితే సరికొత్త బజాజ్ డోమినార్ 250 బైక్ ధర కూడా అదిరిపోయింది అనే చెప్పాలి.. ఒక 50 వేలు తక్కువ రాయల్ ఎన్ ఫిల్డ్ వచ్చేస్తుంది. అంటే ఈ బైక్ ఖరీదు 1.45 లక్షల నుంచి 1.55 లక్షల రూపాయల వరకు ఉండనుంది. పల్సర్ బైక్ కంటే స్టైల్ గా, పెద్దగా ఉన్న బైక్ ను మధ్య తరగతి ప్రజలు కోనేలేనంత రేంజ్ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: