లగ్జరీ కారును కొనాలనుకుంటున్నారా. అయితే మీరు ఈ కారు గురించి తెలుసుకోవాల్సిందే. తాజాగా రోల్స్ రాయిస్ మరో సరికొత్త మోడల్ తో భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇక రోల్స్ రాయిస్ తన ఘోస్ట్ ఎక్స్ టెండెడ్ వీల్ బేస్ ను కారును భారత్లో తాజాగా విడుదల చేసింది. ఈ కారు ధర రూ.7.95 కోట్లుగా నిర్ణయించారు. ఇక పేరుకు తగ్గట్టుగానే ఈ కారు ఘోస్ట్ సిరీస్ లో రూపొందించిన ఎక్స్ టెండెడ్ వెర్షన్. దీనిని చౌఫెర్ డ్రివెన్ సెడాన్ గా ఉపయోగించాలని సంస్థ యాజమాన్యం తెలిపింది.

ఇక కారు వెనుక సీట్లో కూర్చొనే ప్రయాణీకులకు మరింత ఎక్కువ స్థలాన్ని ఈ ఎక్స్ టెండెడ్ కారులో చూడవచ్చునని తెలిపారు. ఇక దీంతో పాటు కొన్ని అదనపు ఫీచర్లతో ఈ మోడల్ ను తీర్చిదిద్దారని తెలియజేశారు. డిజైన్ పరంగా పెద్దగా మార్పులు చేయలేదని అన్నారు. స్టాండర్డ్ ఘోస్ట్ మోడల్లో వాడిన స్టాండర్డ్ స్పేస్ ఫ్రేమ్ ఆర్కిటెక్చర్ ఆధారంగా ఈ మోడల్కు రూపకల్పన చేశారు. సైజు పరంగా చూస్తే, పాత మోడల్ ను కొంచెం పొడిగించినట్టుగా ఇది కనిపిస్తోందని అన్నారు. వీల్బేస్ను 3,465 ఎమ్.ఎమ్. వరకు పొడిగించారని తెలిపారు.

ఇక ఈ కారు చూడటానికి అన్ని ఘోస్ట్ మోడళ్లుగానే ఇది కూడా కనిపిస్తుందన్నారు. డిజైన్ను సింపుల్ గానే ఉంచారు. ఇక వెనుక డోర్లను, ఓపెనింగ్ల చుట్టూ ఉన్న బాడీని మాత్రమే డెవలపర్లు ఎక్స్ టెండ్ చేశారు. అంతేకాదు పాత మోడళ్లలో ఉన్న ఇంజిన్లనే దీంట్లో కొనసాగించారని తెలిపారు. ఘోస్ట్ ఎక్స్టెండెడ్ కూడా అదే 571 PS 6.75-litre twin-turbo V12 ఇంజన్తో నడుస్తుందన్నారు. లోపలి భాగంలో కొన్ని కొత్త ఫీచర్లు ఉన్నాయని తెలియజేశారు. వినియోగదారులు ఆప్షనల్గా సెరెనెటీ సీట్లను ఎంచుకోవచ్చునన్నారు. రెండు కూలింగ్ మోడ్లతో ఉన్న షాంపైన్ ఫ్రిజ్, ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్, ఇన్ బిల్ట్ వై-ఫై వంటి ఫీచర్లతో ఈ వేరియంట్ ఆకట్టుకునేలా ఉంటుందన్నారు. భారత్లో రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఎక్స్ టెండెడ్ ప్రారంభ ధర రూ.7.95 కోట్లు. స్టాండర్డ్ క్రోర్ మోడల్ రూ.6.95 కోట్లకు లభిస్తుందని సంస్థ యాజమాన్యం తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: