జాతి వివక్ష,... దురహంకారం.. ఇలాంటి వార్తలు ఎక్కువగా విదేశాల్లో వింటుంటాం.. ఇప్పుడు ఇలాంటి ఘటన మన హైదరాబాద్‌లోని ఐకియాలోనూ చోటు చేసుకుంది. ఇక్కడ మణిపూర్‌ నుంచి వచ్చిన ఓ మహిళను  భద్రతా సిబ్బంది  తనిఖీల పేరుతో ఇబ్బంది పెట్టారు. చెకింగ్ కోసం అరగంట పాటు ఓ మహిళను  నిర్బంధించారు. ఈ విషయం గురించి ఆ మహిళ భర్త సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.


తన భార్యకు ముందుదా ఎవరిని భద్రతా సిబ్బంది ఆపలేదని.. కేవలం తన భార్యను మాత్రమే సిబ్బంది తనిఖీల కోసం ఆపారని ఆయన ఆరోపించారు. తనిఖీ పూర్తయిన తర్వాత కూడా అరగంట పాటు అక్కడే  ఆమెని నిర్బంధించారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఐకియా సిబ్బంది ఆ మహిళకు క్షమాపణలు చెప్పేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో సిబ్బంది  నేర్పించాలని ఐకియాకు షాక్ ఇచ్చారు. దీంతో ఐకియా ఇండియా వెంటనే స్పందించింది. జాతి దురహంకార భావన ఏ రూపంలో ఉన్నా సహించబోమంటూ... ఆ మహిళకు సారీ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: