ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికి ఉందా అన్న అనుమానం వస్తుంటుంది. అయితే.. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తామంటున్నారు ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు.. ఈ  నెల నుంచి ప్రజా సమస్యలపై ప్రజల వద్దకు వెళ్లి పోరాడుతామని గిడుగు రుద్రరాజు అంటున్నారు. భారత్ జోడో మళ్ళీ దశ యాత్రకు రాహుల్ గాంధీకి మద్దతుగా రాష్ట్రంలో జనవరి 26 నుంచి మార్చి 26 వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడతామని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు.


బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సమస్యలపై మొదటి 15 రోజులు పాదయాత్ర చేపడతామని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. జనవరి మాసంతో సబ్ ప్లాన్ చట్టం గడువు ముగుస్తున్నందున తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నామని గిడుగు రుద్రరాజు అన్నారు. వక్ఫ్‌ బోర్డు ఆస్తులు కాపాడాలని వెనుకబడిన వర్గాలకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించాలని గిడుగు రుద్రరాజు అన్నారు. సర్పంచుల సమస్యలపై వారి చేపట్టిన పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు పలుకుతుందని గిడుగు రుద్రరాజు అన్నారు. రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ బకాయి బబ్బులను తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని గిడుగు రుద్రరాజు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap