నిద్ర పోయి లేచేటపుడు, వంగి లేస్తున్నపుడు పిక్కలు పట్టేస్తుంటాయి. అయితే, ఆ పట్టేయడం వల్ల పిక్కలు ఎంతో నొప్పిగా ఉంటాయి. అందుకు కారణం, నీళ్లు తక్కువగా తాగడం, పోషకాహారం తీసుకోకపోవడం. మనం తినే ఆహారంలో ముఖ్యంగా లవణాలు,ఖనిజాలు తగ్గిపోవడం ఇందుకు ప్రధాన కారణం. సోడియం,కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తినాలి. పిక్కలు పట్టేసినపుడు కంగారు పడకుండా పిక్కల్లో కండరాలు వదులయ్యేలా చేతితో మసాజ్ చేయాలి. కొంచెం ఉప్పు కలిపిన నీళ్ళు లేదా, కాస్త ఉప్పునీటిలో నిమ్మకాయ కలిపి తాగాలి. పిక్కలు పట్టేసిన వెంటనే ఒక అరటిపండును తింటే కూడా సమస్య తీరిపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: