సాధార‌ణంగా అందమైన మెరిసే చర్మం కావాలని అనుకోని వారు ఎవరూ ఉండరేమో.. కానీ అది పొందడం మాత్రం చాలా తక్కువ మందికే సాధ్యమవుతుంది. కళ్ల కింద నల్లని చార‌లో, అనుకోని విధంగా వచ్చిన ఓ మొటిమో, లేక పొడిబారిన, నల్లబడిన చర్మమో.. ఇలా చెప్పుకుంటూపోతూ అందానికి అన్నీ అడ్డంకులే ఉంటాయి. వాటి నుంచి బ‌య‌ట ప‌డ‌డానికి ఏవేవో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అయితే ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టాలంటే బెల్లం ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. 

 

బెల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలూ ఎక్కువే. చర్మం, శిరోజాల అందచందాలను బెల్లం ఇనుమడింపచేస్తుంది. శరీర బరువును సైతం తగ్గిస్తుంది. శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంతేకాదు రక్తంలోని హిమోగ్లోబిన్‌ ప్రమాణాన్ని పెంచుతుంది. ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్న బెల్లం చ‌ర్మ సౌంద‌ర్యానికి ఎలా ఉప‌యోగించాలంటే.. ముందుగా బెల్లం పొడి, నిమ్మరసం రెండూ క‌లిపి ముఖానికి అప్లై చేయాలి. ఓ పావు గంట త‌ర్వాత వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం స‌లువుగా మొటిమ‌ల‌ను, వాటి వ‌ల్ల వ‌చ్చే మ‌చ్చ‌లు తొల‌గిస్తుంది.

 

అలాగే బెల్లం పొడి, టమాటో జ్యూస్ రెండూ క‌లిపి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పిగ్మెంటేషన్, బ్లేమిషెస్ మరియు డార్క్ స్పాట్స్ కి చెందిన ఇబ్బందులన్నీ ఈ ప్యాక్ తో తొలగిపోతాయి. మ‌రియు బెల్లం పొడి, ముల్తానీ మ‌ట్టి, పెరుగు క‌లిపి జుట్టుకు అప్లై చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల శిరోజాలు స్మూత్ గా, సిల్కీగా మారేలా చేస్తుంది. అదే విధంగా, ప్ర‌తి రోజు కొద్దిగా బెల్లం తిన‌డం వ‌ల్ల.. ఇందులోని ఐరన్‌... శిరోజాలు పటిష్టంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: