దేశంలో ఎంఐఎం పార్టీ కి ప్రత్యేకత తో పాటు మంచి ఫాలోయింగ్ ఉంది.. అయితే వీరి ఎజెండా ఏంటనేది మొదటినుంచి కొంత మిస్టరీ గానే ఉంది.. వీరికి అధికారంలోకి వచ్చేటంత సీట్లు రాకపోయినా ఎవరు అధికారంలోకి రావాలని వీరి సపోర్ట్ ఉండాల్సిందే. ప్రాంతీయ పార్టీ లకు ఈ పార్టీ ఆయువు పట్టులాంటిదే.. అందుకే ఏ పార్టీ వీరితో సున్నం పెట్టుకోవాలనుకోదు.. ఇక తెలంగాణ లో ఎంఐఎం పార్టీ సపోర్ట్ లేనిదే అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు.. అందుకు తగ్గట్లే ఎంఐఎం కి మంచి సపోర్ట్ ఉంది..