ఏపీ లో మరి కొన్ని రోజుల్లో శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అధికార పార్టీ ఇప్పటికే ఆ దిశగా ఏర్పాట్లు పూర్తి చేసుకుంటుంది.. ఈ సమావేశాలకు చంద్రబాబు వచ్చేది రానికేది కొంత అనుమానంగా ఉంది. 60 యేళ్ల వయసు పైనున్న వారు బయట తిరగడం మీద కూడా ప్రస్తుతం ఒకరకంగా ఆంక్షలు ఉన్నట్టే. ప్రభుత్వం కూడా ఆ వయసు పై బడిన వారు జనం మధ్యకు రావొద్దని సూచిస్తూ ఉంది.