రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు.. ఏ పార్టీ ఎప్పుడు కలుస్తాయి, ఎప్పుడు విడిపోతాయో, ఎప్పుడు విమర్శలు చేసుకుంటాయి, ఎప్పుడు పొగడ్తలు చేసుకుంటాయి చెప్పలేం.. ఈరోజు తిట్టుకున్నా ఇద్దరు నేతలు రేపు ఒకే పార్టీ లో కండువాలు కప్పుకుంటూ ఉంటారు. ఈరోజు కలిసి ప్రచారం చేసిన నేతలు రేపు వేర్వేరు పార్టీ లో ఉండి విమర్శలు చేసుకుంటూ ఉంటారు . ఈ తరహా రాజకీయం ఏపీ లో ఎక్కువ చూస్తుంటాం.. ఎందుకంటే అక్కడ రాజకీయ నాయకులు పార్టీ లు మారడం ఎక్కువ కాబట్టి..