తెలంగాణ లో కేసీఆర్ అధిపత్యానికి రోజులు దగ్గరపడ్డాయి.. ఇకపై ఆయన చేసిందే చట్టం, చెప్పిందే మాట అనే పద్ధతి కి కాలం చెల్లిందా..అంటే అవుననే అంటున్నాయి రాజకీయ విశ్లేషణలు.. తాజాజువ్వలా ఒక్కసారిగా బీజేపీ పార్టీ తెలంగాణ లో బలపడి దుబ్బాక లో టీ ఆర్ ఎస్ ని ఓడించింది.. అంతేనా గ్రేటర్ లో కూడా గెలుపు ధీమా తో ముందుకు వెళుతుంది.. ఈ క్రమంలో ఇక్కడ కేసీఆర్ ఓడిపోతే మాత్రం అయన రాజకీయ జీవితం, పార్టీ రాజకీయ భవిష్యత్ కొంత రిస్క్ లోఉన్నట్లే అని చెప్పాలి.. ఎందుకంటే ఓ నేషనల్ పార్టీ ఇక్కడ బలం చేజిక్కుంచుకుంటే అది తగ్గిపోవడం ఇప్పట్లోజరిగే పని కాదు.