గ్రేటర్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుంది. తూటాల్లాంటి మాటలు.. వెనుకా ముందు చూసుకోకుండా రాజకీయ ప్రత్యర్థిని ఎంత మాట అయినా అనేందుకు ఏ మాత్రం మొహమాటపడని నేతగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అవతరించారు.. ఇదే సాకుగా ప్రచార సభల్లో సీఎం కేసీఆర్ ని దారుణ విమర్శలు చేస్తున్నారు. ఒక్క దుబ్బాక విజయం తోనే బండి ఇంత విమర్శలు చేస్తుంటే గ్రేటర్ లో ఓడిపోతే ఇంకేమైనా ఉందా..గ్రేటర్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకు బర్ బాద్ కావటం ఖాయమన్నారు.