రాజకీయాలకు బ్రేక్ ఇస్తూ పవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీ లో వకీల్ సాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి వేణు శ్రీరామ్ దర్శకుడు కాగా సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.. ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ అయ్యప్పనుం కోషియం అనే మలయాళ సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. దసరా సందర్భంగా అధికారిక ప్రకటన రాగ  ఈ సినిమా దర్శకుడు సాగర్ చంద్ర ఇప్పటికే షూటింగ్ కి అన్ని ఏర్పాట్లు చేశాడు.. వకీల్ సాబ్ షూటింగ్ లో ఉన్న పవన్ రాకకోసం అందరు వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.