రామ్ చరణ్ తేజ్ హీరో గానే కాకుండా నిర్మాత గా కూడా సక్సెసయ్యాడని చెప్పొచ్చు.. అయన నిర్మించిన ఖైదీ నెంబర్ 150 , సైరా సినిమాలు హిట్ అవడంతో పాటు మంచి నిర్మాణ విలువలు కలిగి ఉన్న సినిమా గా నిలిచాయి.. దీంతో రామ్ చరణ్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న ఆచార్య సినిమా కి కూడా నిర్మాతగా ఉన్నాడు.. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.. నిర్మాణంలో ఎక్కడా తగ్గకుండా ఈ సినిమా ని నిర్మించబోతున్నారని తెలుస్తుండగా రాంచరణ్ బయటి హీరోలతో సినిమాలు చేయట్లేదని ఓ వార్త ఇండస్ట్రీ లో హల్చల్ చేస్తుంది..