కమర్షియల్ సినిమాలకు మెసేజ్ ను జోడించి సూపర్ హిట్ కొట్టే దర్శకుడు ఎవరంటే కొరటాల శివ అని టాలీవుడ్ ప్రేక్షకులు ఎవరైనా చెప్తారు. అయన సినిమాల్లో మాస్ ఎలెమెంట్స్ తో పాటు మెసేజ్ కూడా క్యారీ అవుతుంది.. తొలి సినిమా తోనే అయన స్టామినా ఏంటో అందరికి అర్థమైపోయింది.. ప్రభాస్ తో చేసిన మిర్చి ఇద్దరికీ కెరీర్ లో మైలురాయిగా మిగిలిపోయాయి.. రెండో సినిమాగా చేసిన శ్రీమంతుడు టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టిందని చెప్పొచ్చు.. ఆ తర్వాత వచ్చిన జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలు కొరటాల శివ ని టాప్ డైరెక్టర్ గా నిలబెట్టాయి..