కెజిఎఫ్ సినిమా వచ్చెనంతవరకు కన్నడ సినీ పరిశ్రమను కుటీర పరిశ్రమగా భావించేవారు సినీ లోకం.. అక్కడి సినిమాలు బాగున్నా బడ్జెట్ లు తక్కువ కావడంతో అక్కడి సినిమా లపై ఎవరు అంతగా ఆసక్తి చూపేవారు కాదు.. కానీ కేజిఎఫ్ సినిమా వచ్చిన తరువాత కన్నడ సినిమాలపై అందరి దృష్టిపడింది.. టాలీవుడ్ నుంచి వచ్చిన బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో  అంతకుమించి క్రేజ్ కేజిఎఫ్ కి ఉంది అనడంలో ఎలాంటి సంకోచం లేదు. కన్నడ నుంచి ఎలాంటి  అంచనాలు లేకుండా వచ్చిఒక్కసారిగా దేశాన్ని ఊపేసింది అని చెప్పొచ్చు.. ఈ సినిమా తో యష్ కూడా ప్రభాస్ లాగే దేశమంతటా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు..