చిన్న దర్శకుడిగా చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చి టాప్ దర్శకుడిగా సెటిల్ అయినా మారుతి కి గత కొన్ని రోజులనుంచి ఎలాంటి సినిమా అనౌన్సమెంట్ చేయలేదు.. అయన చేసిన ప్రతిరోజు పండగే సినిమా సూపర్ హిట్ అయినా మారుతి ఇంతవరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు..  ఈరోజుల్లో అనే చిన్న బడ్జెట్ సినిమా చేసి అందరి కళ్ళల్లో పడ్డ మారుతి ఆ తరువాతి చిత్రం బస్ స్టాప్ తో నూ మంచి పేరు తెచ్చుకున్నాడు.. ఈ రెండు సినిమాలు ఇచ్చిన హిట్ తో ఇక మారుతీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.. మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి.. అల్లు శిరీష్ తో చేసిన కొత్త జంట పరవాలేదనిపించుకోగా దర్శకుడిగా మాత్రం మంచి పేరు వచ్చింది..