నాగార్జున వారసుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ కి లక్ ఫాక్టర్ మాత్రం కలిసి రాలేదని చెప్పాలి.. ఎందుకంటే అయన చేసిన మూడు సినిమాలు పెద్దగా ఆడిన దాఖలాలు లేవు.. తొలి సినిమా అఖిల్ పెద్ద ఫ్లాప్ గా నిలిచింది.. రెండో సినిమా హలో పర్వాలేదనిపించుకుంది.. మూడో సినిమా గా వచ్చిన మిస్టర్ మజ్ను అయితే ప్రేక్షకులు అస్సలు మెచ్చలేదు.. దాంతో ఈ సారి హిట్ కొట్టకపోతే ప్రజలు గుర్తుంచుకుపోయే పరిస్థితి లేదు.. దాంతో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ సినిమా ని చేస్తున్నాడు..