తెలంగాణాలో బీజేపీ ప్రభంజనం మొదలయ్యిందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.. ఇప్పటికే నాలుగు ఎంపీ స్థానాలు, రెండు అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్న బీజేపీ పార్టీ గ్రేటర్ ని కూడా కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తి చేస్తుంది పార్టీ వర్గం.. నిజానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థులను ఇండిపెండెంట్ అభ్యర్థులకన్నా హీనంగా చూశారు. అసలు ఎందుకు పోటీ చేస్తున్నారు అన్నట్లు చూడసాగారు.. కానీ ఇప్పుడు బీజేపీ అంటే అధికార పార్టీ కి ముచ్చెమటలు పట్టం ఖాయం.. దుబ్బాక గెలుపుతో తెలంగాణ లో రాజకీయం సీన్ మొత్తం మారిపోయింది.