దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం నుంచి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఒక అధికారంలో ఉన్న పార్టీ ని ఎలాంటి బలం లేని పార్టీ ఓడించిందంటే వారు ఎంత గా ప్రజల్లో నమ్మకం సాధించారో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఎలక్షన్స్ సమయంలో బీజేపీ కి ఎలాంటి బలం లేదు.. ఈసారి ఎన్నో కొన్ని సీట్లు సాధించకపోతే పార్టీ పరిస్థితి దారుణం అయిపోతుందని కూడా అన్నారు.. అనుకున్నట్లుగానే బీజేపీ ని ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు.. టీ ఆర్ ఎస్ కి పట్టం కట్టి వన్ సైడ్ విజయాన్ని అందించారు. దాంతో ప్రజలు కొన్ని రోజుల తర్వాత తాము చేసిన తప్పును గుర్తించి ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ ని గెలిపించారు..