ఇతర రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా ఏపీ లో అధికార, విపక్షాలు ఎల్లప్పుడూ విమర్శించుకుంటూనే ఉంటాయి.. పోటీ పోటీగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చంద్రబాబు, జగన్ ల కాంబో చాలా ఆసక్తికరంగా ఉంటుంది.  కానీ వీరిద్దరూ ఒక్క అభిప్రాయానికి ఎప్పుడు రారు. ఒకరు కరెక్ట్ గా ఉన్నప్పుడు ఇంకొకరు రాంగ్ రూట్ లో ఉంటారు. ఒకరు చెప్పినప్పుడు మరొకరు వినరు..అందుకే వీరిద్ధమధ్య సయోధ్య ఏ విషయంలోనూ ఉండదు. నిజానికి అధికార, ప్రతిపక్షాలు అలానే ఉండాలి. కానీ రాష్ట్రానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అని పక్కన పెట్టి ఆ సమస్య ఇద్దరు కల్సి పోరాడితేనే రాష్ట్రానికి మేలు జరిగేది.. కానీ అది కలలో కూడా చేయమన్నట్లు ఈ ఇద్దరు వ్యవహరిస్తున్నారు..