రాధేశ్యామ్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న ప్రభాస్ ఆ తర్వాత వరుసగా మూడు సినిమాలను లైన్ లో ఉంచిన సంగతి తెలిసిందే.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాచేస్తుండగా, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమా ని కూడా ప్రభాస్ చేస్తున్నాడు, మరొకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని సలార్ సినిమా ఇటీవలే అన్న్స్ అయ్యింది.. మొదటి రెండు సినిమాలు అనౌన్స్ అయి చాల రోజులే అయినా  ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్ లో ఉండడంతో సినిమా మేకర్స్ ప్రభాస్ కోసం వేచి చూడక తప్పట్లేదు.. దాంతో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రాధే శ్యామ్ ని పూర్తి చేసి తర్వాతి సినిమాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడట..